News November 22, 2024
‘కుర్చీ’ దక్కేదెవరికి? మహారాష్ట్రలో అంతర్గత పోరు!

ఇంకా ఫలితాలే వెలువడలేదు. మహారాష్ట్రలో 2 కూటముల్లో CM కుర్చీ కోసం పోరు మొదలైంది! క్రితంసారి ఏక్నాథ్ శిండేకు అవకాశం ఇవ్వడంతో ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పదవి అప్పగించాలని BJP నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎంగా శిండేనే కొనసాగుతారని శివసేన నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రానప్పటికీ కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాతో ఉంది. సీఎం పదవి తమకే వస్తుందని కాంగ్రెస్, శివసేన UBT చెప్పుకుంటున్నాయి.
Similar News
News January 28, 2026
బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెెెెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగే ఆస్కారముంది.
News January 28, 2026
అనేక ప్రశ్నల్ని మిగిల్చిన అజిత్ ఆకస్మిక మృతి

అజిత్ పవార్ ఆకస్మిక మృతి MH రాజకీయాల్లో పలు ప్రశ్నలను మిగిల్చింది. 2023లో అజిత్ శరద్ పవార్ NCPని వీడి 41 మంది MLAలతో ప్రభుత్వంలో చేరారు. తాజాగా MNP ఎలక్షన్లో శరద్‌తో కలిశారు. 2 వర్గాలు విలీనం కావొచ్చన్న క్రమంలో ఆయన మరణం దాన్ని సందిగ్ధంలోకి నెట్టింది. అటు విలీనమైతే అజిత్ వారసుల పరిస్థితేమిటి? కాకుంటే అజిత్ వర్గానికి నేతృత్వం వహించేదెవరు? అనే ప్రశ్నలూ ఉన్నాయి. GOVTలో కొనసాగితే Dy CM ఎవరనేదీ తేలాలి.
News January 28, 2026
ఈ 5 చోట్ల నెమలి ఈకలు ఉంచితే..?

నెమలి ఈకలు సానుకూల శక్తిని, సంపదను ఆకర్షిస్తాయి. కుబేరుని ఆశీస్సులు అందిస్తాయి. అయితే పూజా మందిరంలో 3-7, బీరువాలో 5 నెమలి ఈకలను ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద 7 ఈకలు వేలాడదీయాలంటున్నారు. తద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుందని అంటున్నారు. ఉత్తర దిశలో 11, పిల్లల స్టడీ/పెద్దల వర్క్ టేబుల్‌పై 3 ఈకలను ఉంచితే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని అంటున్నారు.


