News April 14, 2025
రుతురాజ్ ప్లేస్లో ఎవరికో చోటు?

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలపై ఫ్రాంచైజీ దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. మరి వీరిలో ఎవరు సీఎస్కేకు అవసరమో కామెంట్ చేయండి.
Similar News
News April 15, 2025
APR 17న IPLలో 300 స్కోర్.. స్టెయిన్ ప్రిడిక్షన్ వైరల్

వాంఖడే వేదికగా ఎల్లుండి SRH-MI మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మార్చి 23 చేసిన ఓ ప్రిడిక్షన్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ‘ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి 300 స్కోర్ను చూడబోతున్నాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో స్టెయిన్ అంచనా నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News April 15, 2025
సల్మాన్ను బెదిరించిన వ్యక్తికి మతిస్థిమితం లేదు: పోలీసులు

ఇటీవల సల్మాన్ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని గుజరాత్కు చెందిన మయాంక్ పాండ్య(26)గా ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తి అని తేలిందని ప్రకటించారు. సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్లైన్కు ఇటీవల సందేశం వచ్చింది. వోర్లీ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా నిందితుడి విషయం వెలుగుచూసింది.
News April 15, 2025
గవాస్కర్ గొప్ప మనసు!

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆయనకు చెందిన ‘ది ఛాంప్స్’ ఫౌండేషన్ ద్వారా మాజీ క్రికెటర్ కాంబ్లీకి సాయం చేసేందుకు ముందుకొచ్చారని జాతీయ మీడియా తెలిపింది. నెలకు రూ.30వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న కాంబ్లీని ఇటీవల వాంఖడే గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గవాస్కర్ కలిశారు. ఆయన పరిస్థితి తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.