News March 21, 2024
లిక్కర్ స్కాంలో ఎవరెవరు అరెస్టయ్యారంటే?

ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఆప్ MP సంజయ్ సింగ్, BRS MLC కవిత, మాగుంట రాఘవ, విజయ్ నాయర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేశ్ జోషి, అమన్ దీప్, అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది.
Similar News
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<
News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.
News September 13, 2025
జగన్.. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండి: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని YS జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. 17 కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,450 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి, రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు. జగన్‌లా తాము విఫలం కావొద్దని PPPని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా ఉందని చెప్పారు.