News August 15, 2024
ఎంపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎంపాక్స్‌ను మరోసారి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. కాగా ఓ వైరస్ కారణంగా కాంగోలో ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తోంది. ఇది సోకిన వ్యక్తుల నుంచి సులభంగా అవతలి వారికి సోకుతోంది. చికిత్స అందకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
Similar News
News July 4, 2025
ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్‌పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
News July 4, 2025
డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

కీర్తి సురేశ్, సుహాస్ జంటగా నటించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. డైరెక్టర్ అని IV శశి తెరకెక్కించిన ఈ మూవీకి స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. ఓ గ్రామంలో ఎదురైన అసాధారణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథ.
News July 4, 2025
భోగాపురం ఎయిర్పోర్ట్ తాజా ఫొటోలు

AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి వరమైన అల్లూరి సీతారామరాజు(భోగాపురం, VZM) ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ATC టవర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిత్యం 5,000 మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8కి.మీ పొడవైన ఈ రన్‌వేపై తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు.