News June 6, 2024
టీడీపీలో మంత్రి పదవులు ఎవరికి?

AP: CBN కేబినెట్లో TDP నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.
Similar News
News January 3, 2026
నేటి ముఖ్యాంశాలు

* ‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలంటూ TG అసెంబ్లీలో తీర్మానం
* రూ.7వేల Crతో HYDకు గోదావరి జలాలు: CM రేవంత్
* పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CM CBN
* ఫోర్బ్స్ డేటా.. FY-2026లో పెట్టుబడుల్లో AP టాప్
* కూటమి దౌర్జన్యాలను తిప్పికొడతాం: YS జగన్
* తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన BRS
* KCR సభకు రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్న కవిత
News January 3, 2026
ఆస్ట్రోనాట్స్‌కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్‌లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
News January 3, 2026
నల్లమల సాగర్‌కు రేవంత్ పరోక్ష అంగీకారం: హరీశ్‌రావు

నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లకు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిపి <<18742119>>కమిటీ<<>> ఖరారు చేసినట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘3నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే 3 నెలల్లో నల్లమల సాగర్‌ను ఆమోదించడమే. ఇందుకు AP పెట్టిన టెండర్ గడువు తీరాకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టును పరోక్షంగా అంగీకరిస్తోందని అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.


