News June 4, 2024
ఈసారి అత్యధిక మెజారిటీ ఎవరికి?
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవరికి దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో గుజరాత్‌లోని నవ్సారీ నుంచి బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో, 2014లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో కడప నుంచి వైఎస్ జగన్ 5.45 లక్షల మెజారిటీతో గెలిచారు. మరి ఈ ఎన్నికల్లోభారీ మెజారిటీ ఎవరిదో!
Similar News
News January 8, 2025
జులై నుంచి చిరంజీవి-అనిల్ మూవీ షూటింగ్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
News January 8, 2025
స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!
చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.