News July 2, 2024

భోలే బాబా ఎవరంటే?

image

UPలోని సత్సంగ్‌లో <<13551764>>తొక్కిసలాటతో<<>> భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ విశ్వ హరి గురించి చర్చ మొదలైంది. ఆయన UP ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామానికి చెందినవారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ‘మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగం’ పేరుతో ఆయన చేపట్టే ప్రవచన కార్యక్రమానికి నిత్యం వేల మంది వస్తుంటారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ 50 మందికి అనుమతిస్తే 50వేల మందికిపైగా హాజరవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.

Similar News

News March 14, 2026

అమరావతిలో బిట్స్ పిలానీ.. 5ఏళ్లలో రూ.1000కోట్ల పెట్టుబడి

image

AP: రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్‌లను మంత్రి లోకేశ్ పరిశీలించారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఆయన్ను కలిసి ప్లాన్‌లను చూపించారు. వీలైనంత త్వరగా క్యాంపస్‌ను ప్రారంభించేలా చూడాలని మంత్రి వారికి సూచించారు. ఇది దేశంలోనే మొదటి AI క్యాంపస్ అని, 5ఏళ్లలో ₹1000Cr పెట్టుబడి పెడతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండు దశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.

News March 14, 2026

టుడే టాప్ స్టోరీస్

image

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

News March 14, 2026

వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

image

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.