News December 16, 2024
BIGG BOSS-8 విజేత నిఖిల్ ఎవరంటే?

BIGGBOSS-8 విజేతగా నిలిచిన నటుడు <<14890791>>నిఖిల్ మలియక్కల్ <<>>మైసూర్(KA)లో జన్మించారు. తల్లి నటి, తండ్రి జర్నలిస్టు కావడంతో చిన్నప్పటి నుంచి డాన్స్, సినిమాలపై ఆసక్తి కలిగింది. నటనపై ఇష్టంతో ఉద్యోగం వదిలేశారు. 2016లో ఊటి చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్‌మాలో వచ్చే గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్‌తో తెలుగు వారిని అలరించారు.
Similar News
News December 7, 2025
రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

AP: బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. రైతుబజార్లను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లను <
News December 7, 2025
శని దోషాలు ఎన్ని రకాలు?

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.
News December 7, 2025
21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్

AP: రాష్ట్రంలో 21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు CS విజయానంద్ తెలిపారు. ‘7.48 లక్షల SC, ST వినియోగదారుల ఇళ్లపైనా 2 కిలోవాట్ల చొప్పున 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సెట్లను అమర్చాలి. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ సిస్టమ్స్, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చిలోగా ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు సూచించారు.


