News August 12, 2024
ఎవరీ జార్జ్ సోరోస్?

హిండెన్‌బర్గ్ ఈసారి సెబీ చీఫ్‌పై ఆరోపణలు చేయడంతో జార్జ్ సోరోస్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. హంగేరియన్-అమెరికన్ బిజినెస్‌మ్యాన్ అయిన సోరోస్ హిండెన్‌బర్గ్‌లో ప్రధాన వాటాదారుగా ఉండి ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అతని సన్నిహితులతో సంబంధాలున్న కాంగ్రెస్ నేతలు దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారన్నది BJP ఆరోపణ.
Similar News
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.
News December 4, 2025
త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
News December 4, 2025
32వేల మంది టీచర్లకు ఊరట

పశ్చిమ బెంగాల్లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.


