News October 3, 2025
దేవుడంటే ఎవరు? ఆయన పేర్లు మీకు తెలుసా?

14 భువనాల సృష్టికర్తయే దేవుడు. ఆయన అనంతమైనవాడు కాబట్టి అనేక పేర్లు గలవు. పరబ్రహ్మమని, సత్యమని, శివుడని, విష్ణువని, శూన్యమని, పరమాత్మయని కొందరు పిలుస్తారు. సుషుమ్నయమని, శూన్య పదమని, బ్రహ్మ రంధ్రమని, మహాపథమని, శ్వశామనమని, శాంభవీయని, మధ్యమార్గమని కూడా పిలుస్తారు. ‘నేను’ అనేదే ఆ భగవంతుడి అసలైన పేరు అని రమణ మహర్షి చెప్పారు. దేవుడి నామం ‘ఓమ్’ అని పతంజలి మహర్షి అన్నారు. <<-se>>#WhoisGod<<>>
Similar News
News October 3, 2025
టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్‌కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
News October 3, 2025
టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
News October 3, 2025
రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల MP, MHలో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. MPలోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్‌ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.