News April 11, 2024
అవనిగడ్డ ఎవరి అడ్డా!

AP: కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డ ఆరు మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. 1962లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ ఒకసారి నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ లీడర్ మండలి బుద్ధ ప్రసాద్ను జనసేన పోటీ చేయిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు మరోసారి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 1, 2025
పలు జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు చలి గాలులు అధికంగా వీచే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.
News December 1, 2025
నేడు గీతా జయంతి

పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈరోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకొంటాం. ‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 1, 2025
వర్క్ స్ట్రెస్తో సంతానలేమి

పనిఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇవి స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని, సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో అండాల విడుదల (ఓవ్యులేషన్) ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు.


