News July 28, 2024
జిష్ణుదేవ్ వర్మ ఎవరంటే?

తెలంగాణ గవర్నర్‌గా <<13722854>>జిష్ణుదేవ్<<>> వర్మను రాష్ట్రపతి నియమించారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో BJPలో చేరారు. రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2018-2023 వరకు త్రిపురకు డిప్యూటీ CMగా, బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా సేవలందించారు. TG BJP నేత ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తుండగా, ఆ రాష్ట్ర నేత ఇక్కడికి గవర్నర్‌గా రావడం విశేషం.
Similar News
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
News November 2, 2025
కరువు మండలాల జాబితా విడుదల

AP: 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.
News November 2, 2025
నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం


