News August 22, 2025
ఎవరా లీకువీరుడు..?

TG సెక్రటేరియట్‌లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Similar News
News August 23, 2025
DSC అభ్యర్థులకు కీలక సూచనలు

AP: కాల్ లెటర్ అందిన DSC అభ్యర్థులకు కన్వీనర్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ‘ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3సెట్ల సర్టిఫికెట్ల కాపీలు, 5పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషను(CV)కు హాజరు కావాలి. ముందే వాటిని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. CVకి తప్పనిసరిగా రావాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తాం’ అని తెలిపారు.
News August 23, 2025
సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్ ప్రారంభం: లోకేశ్

AP: సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో ఈ పోర్టల్‌ను అనుసంధానించాలని సూచించారు. ఏటా 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
News August 23, 2025
కమ్యూనిస్ట్ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆయన 1998, 2004లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు.