News June 11, 2024

ఎవరీ మోహన్ చరణ్?

image

ఒడిశా 15వ <<13422003>>సీఎం<<>>గా ఎన్నికైన 53 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ ఆదివాసీ నేత. ఆయన కియోంజర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు MLAగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోహన్‌కు ఏకంగా 47.05 శాతం ఓట్లు రావడం గమనార్హం. మోహన్ ప్రజాసేవతో మంచి గుర్తింపు పొందారు. ఫైర్ బ్రాండ్‌గానూ పేరొందారు. గత ఏడాది నిరసనలో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోడియంవైపు పప్పు విసిరి సస్పెన్షన్‌కు గురవ్వడంతో మోహన్ పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News September 13, 2025

ఆ ఊరి నిండా IAS, IPSలే!

image

UPలోని మాధోపట్టి గ్రామం UPSC ఫ్యాక్టరీ, IAS విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామం 50 మందికిపైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. వారంతా IAS, IPS, IRS, IFS ఆఫీసర్లుగా సేవలందిస్తున్నారు. 1914లో ముస్తఫా ఈ గ్రామం నుంచి మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే కుటుంబంలో నలుగురు సోదరులు సివిల్స్‌కు ఎంపిక కావడంతో ఆ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఈ ఊరికి వచ్చిన కోడళ్లు కూడా IAS, IPS సాధించారు.

News September 13, 2025

ఆసియాకప్: ఫైనల్లో భారత మహిళా జట్టు

image

హాకీ ఆసియా కప్‌లో భారత మహిళా జట్టు ఫైనల్ చేరింది. జపాన్‌‌తో జరిగిన సూపర్ స్టేజి-4 మ్యాచ్‌లో 1-1 గోల్స్‌తో మ్యాచ్ డ్రాగా ముగియగా, అటు కొరియాపై చైనా 1-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఆధారంగా ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఫైనల్ చేరింది. రేపు చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే WCనకు అర్హత సాధించనుంది. ఇటీవల జరిగిన పురుషుల హాకీ ఆసియాకప్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News September 13, 2025

ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

image

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.