News March 25, 2024
ఎవరీ నమన్ ధీర్?

MI కొత్త ప్లేయర్ నమన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఏమాత్రం బెదురు లేకుండా ఆడి 10 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఫీల్డింగ్‌లోనూ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నారు. 24ఏళ్ల నమన్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ, డీవై పాటిల్, షేర్-ఏ-పంజాబ్ టీ20 టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసి హిట్టర్‌గా పేరొందారు. దీంతో వేలంలో అతణ్ని MI రూ.20లక్షలకు సొంతం చేసుకుంది.
Similar News
News April 6, 2026
GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్‌సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21
News April 6, 2026
తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
News April 6, 2026
అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.


