News December 20, 2024

అశ్విన్ తర్వాత ఎవరు?

image

అశ్విన్ రిటైర్మెంట్‌తో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్ల లిస్టులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ సుందర్ ముందువరుసలో ఉన్నారు. ముంబై ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కూడా పోటీ పడుతున్నారు. ఇతనికి దేశవాళీల్లో 100వికెట్లు, 40కి పైగా బ్యాటింగ్ AVG ఉంది. కుల్దీప్ బౌలింగ్ గణాంకాలు బాగున్నా బ్యాటింగ్‌‌లో వెనకబడి ఉన్నారు. అక్షర్ ఉన్నా బౌలింగ్‌లో వైవిధ్యం కావాల్సిన తరుణంలో అవకాశాలు తక్కువే.

Similar News

News February 5, 2025

KNR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. మొత్తంగా 05.02.2025 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.

News February 5, 2025

దేశంలో నాన్‌వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా

image

దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్‌వెజ్‌ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్‌ఈస్ట్‌తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.

News February 5, 2025

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఒప్పుకోని ‘AAP’

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్‌కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.

error: Content is protected !!