News April 9, 2024

ఎవరీ నితీశ్ కుమార్ రెడ్డి?

image

ఈరోజు పంజాబ్, హైదరాబాద్‌ మ్యాచ్‌లో సూపర్ స్టార్లు విఫలమైన చోట 37 బంతుల్లో 64 రన్స్ చేశాడు తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి. వైజాగ్‌కు చెందిన నితీశ్, ఆంధ్రా తరఫున క్రికెట్ ఆడుతున్నారు. స్వింగ్ బౌలింగ్, దూకుడైన బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్ అతడి సొంతం. గడచిన రంజీ సీజన్‌లో రహానే, శ్రేయస్ వంటి ఆటగాళ్లను ఔట్ చేశారు. నితీశ్ భవిష్యత్ సూపర్ స్టార్‌ అని టీమిండియా క్రికెటర్ విహారీ ట్వీట్ చేయడం విశేషం.

Similar News

News March 14, 2026

Vote Vibe సర్వే.. బెంగాల్ సీఎంగా మమతకే ఓటు!

image

త్వరలో WB అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Vote Vibe సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తర్వాతి CMగా మమతా బెనర్జీ వైపు 42% మంది ఓటర్లు మొగ్గు చూపారు. BJP నేత సువేందు అధికారికి 19% మంది మద్దతు పలికారు. ప్రస్తుతం మమత ప్రభుత్వ పనితీరు అద్భుతమని 34%, చాలా దారుణమని 18% మంది పేర్కొన్నారు. TMC అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న BJP ఆరోపణలను 47% మంది నమ్మడం గమనార్హం.

News March 14, 2026

అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. డాలర్ కాకుండా యువాన్!

image

అమెరికా డాలర్‌ను దెబ్బకొట్టేందుకు ఇరాన్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. US డాలర్ కాకుండా చైనీస్ యువాన్ కరెన్సీ చెల్లిస్తేనే ‘హార్ముజ్’ నుంచి నౌకలకు పర్మిషన్ ఇస్తామని ఇరాన్ ప్రతినిధి చెప్పినట్లు అల్-జజీరా తెలిపింది. కాగా ఎప్పటి నుంచో ఆయిల్ బిజినెస్ కేవలం అమెరికా డాలర్లలోనే జరుగుతోంది. దీనివల్ల డాలర్ సూపర్ పవర్‌ఫుల్‌గా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు దానికి గండి పడే ఛాన్సుంది.

News March 14, 2026

హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

image

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.