News April 5, 2024
ఎవరీ నితీశ్ రెడ్డి?

CSKతో మ్యాచులో SRH జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఆల్‌రౌండర్‌గా పేరొందిన అతడు.. 2017-18లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 1,237 రన్స్ చేయడంతో వెలుగులోకి వచ్చారు. అదే ట్రోఫీలో నాగాలాండ్‌పై 414 రన్స్‌తో చెలరేగారు. 2022-23లో రంజీ ట్రోఫీ సీజన్లో రాణించిన అతడు.. 34 వికెట్లు పడగొట్టారు. కాగా నితీశ్‌కు ఇది రెండో ఐపీఎల్ మ్యాచ్.
Similar News
News October 13, 2025
కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

కజిరంగా నేషనల్ పార్క్ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంట్ లా చదివారు. పులులను ట్రాక్ చేసే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్ పొందారు.
News October 13, 2025
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు.. 2 రోజులే ఛాన్స్!

TG: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BA, B.Com, BSc కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 15తో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ 10+2 ఉత్తీర్ణులు అర్హులని చెప్పారు. విద్యార్థులు దరఖాస్తుల కోసం <
News October 13, 2025
విద్యార్థినులకు తోడ్పాటునందించే స్కాలర్షిప్

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థినులకు యూ-గో సంస్థ స్కాలర్షిప్ అందజేస్తోంది. 10th, Interలో 70% మార్కులు సాధించి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అర్హులు. సంవత్సరానికి 40వేలు అందిస్తారు. చివరి తేదీ అక్టోబరు 31. వెబ్సైట్: <