News February 8, 2025
ఎవరీ పర్వేశ్ వర్మ?

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్వేశ్ వర్మ మట్టికరిపించిన విషయం తెలిసిందే. జాట్ సామాజిక వర్గానికి చెందిన 47 ఏళ్ల పర్వేశ్ ఢిల్లీ మాజీ CM సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో మెహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 2014- 2024 వరకు వెస్ట్ ఢిల్లీ MPగా పనిచేశారు. కేజ్రీవాల్పై గెలుపు నేపథ్యంలో ఈయన పేరును CM అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 26, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

<
News December 26, 2025
కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.
News December 26, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.9,000 పెరిగి రూ.2,54,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,020కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.700 పెరిగి రూ.1,28,350 పలుకుతోంది.


