News October 10, 2024

రతన్ టాటా వారసుడు ఎవరు?

image

రతన్ టాటా మరణంతో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రతన్‌కు పిల్లలు లేకపోవడంతో ట్రస్ట్‌లో వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన సవతితల్లి కుమారుడు నోయెల్ టాటా పిల్లలు మాయ, నెవిల్లే, లేహ్‌ అందుకు అర్హులనే చర్చ నడుస్తోంది. వీరంతా ప్రస్తుతం టాటా సంస్థలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరే టాటా సామ్రాజ్యానికి కాబోయే అధిపతులని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News

News January 30, 2026

7,948 పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్..

image

నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 <>MTS<<>>, హవల్దార్ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పరీక్ష ఏ నగరంలో ఉంటుందో తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 4 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

News January 30, 2026

యువరాజ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటో చూశారా?

image

సినీ గ్లామర్‌ను వదిలేసి అచ్చమైన భారతీయ ఇల్లాలుగా మారిపోయిన హేజల్ కీచ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్టార్ మోడల్, యువరాజ్ సింగ్ భార్య ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. మోడలింగ్, మేకప్ పక్కన పెట్టి.. పిల్లల సంరక్షణలో ఆమె మునిగిపోయారు. గ్లామర్ కంటే కుటుంబంతో ఉండే సింప్లిసిటీలోనే అసలైన అందం, ఆనందం ఉందని హేజల్ నిరూపిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News January 30, 2026

భారీ సెంచరీ.. ఇతడు 17 ఏళ్ల పిల్లాడా?

image

అండర్-19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఫైజల్ షినోజడా భారీ సెంచరీ బాదారు. ఐర్లాండ్‌పై 142 బంతుల్లోనే 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 163 రన్స్ చేశారు. అయితే అతడి ఫొటో చూసి ఇతడు 17 ఏళ్ల పిల్లాడిలా అస్సలు లేడని నెటిజన్లు అవాక్కవుతున్నారు. కచ్చితంగా తప్పుడు వయసు అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?