News April 3, 2024
పెరిగిన ధరలకు ఎవరు బాధ్యులు?: KTR

2014లో ఉన్న చమురు ధరలను ఇప్పటితో పోల్చుతూ ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘2014 నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో లీటర్ పెట్రోల్ రూ.35, డీజిల్పై రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?’ అని ప్రశ్నించారు. 2014 APR 2న లీటర్ పెట్రోల్ రూ.72.26 మాత్రమే.
Similar News
News November 7, 2025
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.
News November 7, 2025
ప్రకాశం జిల్లాలో 16పోస్టులు.. అప్లై చేశారా?

ఏపీలోని ప్రకాశం జిల్లాలో శిశుగృహ, బాల సదనంలో 16 ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB,పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ, బీఈడీ, బీఏ బీఈడీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
News November 7, 2025
DECలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్: మంత్రి కోమటిరెడ్డి

TG: రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ ద్వారా డిసెంబర్ 19-21 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఈవెంట్కు సంబంధించిన లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ ఇటీవల ఆవిష్కరించారు.


