News June 17, 2024
ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు?: తెలంగాణ కాంగ్రెస్

మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.
Similar News
News March 11, 2025
CT విజయోత్సవం లేనట్లే!

భారత జట్టు గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చాక ముంబైలో విక్టరీ పరేడ్ చేసినట్లే CT గెలిచాకా నిర్వహిస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటి వేడుకలేమీ నిర్వహించట్లేదని తెలుస్తోంది. మార్చి 22 నుంచే ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఈ సమయంలో ఆటగాళ్లు విరామాన్ని కోరుకుంటున్నారు. దీంతో పరేడ్ నిర్వహించట్లేదని సమాచారం. మరోవైపు దుబాయ్ నుంచి ఆటగాళ్లు విడివిడిగా ఇళ్లకు చేరుకుంటున్నారు.
News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.