News July 1, 2024

రోహిత్ వారసుడెవరో?

image

టీ20WCలో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన రోహిత్ ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో సారథిగా ఆయన వారసుడెవరనే చర్చ నెలకొంది. హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకు వస్తున్నా జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జింబాబ్వే టూర్‌కు గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథిని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

BREAKING: నల్గొండ: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ MRO

image

లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా చండూరు తహశీల్దార్ ఆఫీస్‌లో డిప్యూటీ MRO రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 5, 2025

పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

image

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్‌మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

News December 5, 2025

భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

image

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>