News November 11, 2024
రోహిత్ ఆడకపోతే కెప్టెన్ ఎవరంటే?

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని కోచ్ గంభీర్ చెప్పారు. అయితే హిట్మ్యాన్ ఆడతారనే ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. సిరీస్ మొదలయ్యే ముందు దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.
Similar News
News December 20, 2025
ఈ నెల 24న కొడంగల్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
News December 20, 2025
చిన్నారులకు HIV సోకిన రక్తం.. బాధ్యులకు ఏ శిక్ష విధించాలి?

MPలోని సాత్నా ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి వేళ HIV సోకిన రక్తాన్ని ఎక్కించారు. రక్త సేకరణలో అజాగ్రత్తే దీనికి కారణం కాగా, బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. అయితే చిన్నారుల బంగారు భవితను నాశనం చేసిన వీరికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? తమ పిల్లల్లైతే ఇలాగే చేస్తారా? తల్లిదండ్రులకు ఏం చెప్పి ఓదార్చగలం? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News December 20, 2025
గుజరాత్లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

గుజరాత్లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.


