News October 7, 2025
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ప్రధానులెవరు?

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రధాన దైవాలుగా మనం కొలుస్తాం. వీరిలో ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు జవాబు యుగాలను బట్టి మారుతుంది. బ్రహ్మ కల్పంలో బ్రహ్మే ప్రధానం. శివ కల్పంలో శివుడే ప్రధానం. దేవి కల్పంలో దేవియే ప్రధానం. అయితే ఇప్పుడు నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం. అందువల్ల ఈ కల్పంలో విష్ణుమూర్తియే ప్రధాన దైవం. అనేక అవతారాలు ధరిస్తూ ఆయన తన సృష్టిని కాపాడుతూ, ధర్మాన్ని నిలబెడుతున్నాడు. <<-se>>#WhoIsGod<<>>
Similar News
News October 7, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో 20 ఉద్యోగాలు

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/
News October 7, 2025
బంగారం ధరలు.. ALL TIME RECORD

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,250 పెరిగి తొలిసారి రూ.1,22,020కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,150 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,11,850 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 7, 2025
తూర్పుగోదావరి జిల్లాలో జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఈనెల 8న 1014 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 23 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, బీబీఏ, ఎంఎస్సీ అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 నుంచి 35ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.