News October 16, 2024
మహాయుతి కూటమి సీఎం అభ్యర్థి ఎవరంటే?

వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై డిప్యూటీ CM దేవేంద్ర ఫడ్నవీస్ హింట్ ఇచ్చారు. ఆ అభ్యర్థి ఇక్కడే ఉన్నారంటూ, శివసేన అధినేతనే తదుపరి సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందన్నారు. దీంతో ఏక్నాథ్ షిండే పేరును చెప్పకనే చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి లేరని సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News January 3, 2026
రేపే భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్

AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపు నెరవేరనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి వ్యాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం ల్యాండవనుంది. అందులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకుంటారు. ఇప్పటికే విమానాశ్రయంలో ATC సెంటర్లు, రన్వే దాదాపుగా పూర్తయ్యాయి. ‘అనుమతుల నుంచి నిర్మాణం వరకు జగన్ హయాంలోనే జరిగింది. క్రెడిట్ మాత్రం బాబు తీసుకుంటున్నారు’ అని YCP విమర్శలు గుప్పిస్తోంది.
News January 3, 2026
పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!

చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News January 3, 2026
సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారు: అక్బరుద్దీన్

TG: సభకు రాని వ్యక్తి సభ అజెండా డిసైడ్ చేస్తున్నారంటూ KCRను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో MIM MLA అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆయన ఇరిగేషన్పై చర్చిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు BRS ఎమ్మెల్యేలెవరూ సభలో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇక 2,3 రోజుల నుంచి అసెంబ్లీలో కృష్ణా, గోదావరి తప్ప వేరే అంశాలపై చర్చించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇతర సమస్యలపైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


