News July 22, 2024

అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే?

image

అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ నిలిచారు. 1959 FEB 28న తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ తర్వాత రెండేళ్లు పూర్తిస్థాయి బడ్జెట్లు తీసుకొచ్చారు. 1962లో తాత్కాలిక బడ్జెట్ ఆ తర్వాత రెండేళ్లు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1967లో మరోసారి తాత్కాలిక పద్దును తెచ్చారు. ఆ ఏడాది మళ్లీ ఫుడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశాయ్ 1968, 1969లోనూ పూర్తి పద్దును ముందుంచారు.

Similar News

News October 20, 2025

దీపావళి వేడుకల్లో సీఎం దంపతులు

image

AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News October 20, 2025

వేధిస్తున్నారంటూ ఓలా ఉద్యోగి ఆత్మహత్య.. CEOపై కేసు

image

తనను వేధిస్తున్నారంటూ బెంగళూరులో Ola Electric ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. Ola ఇంజినీర్‌ అరవింద్ sept 28న సూసైడ్ చేసుకోగా, అతడి రూమ్‌లో డెత్‌నోట్‌ను పోలీసులు గుర్తించారు. CEO భవీశ్ అగర్వాల్, సీనియర్ ఉద్యోగి సుబ్రతా కుమార్ వేధిస్తూ, జీతాలివ్వలేదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అరవింద్ చనిపోయిన 2రోజులకు అతడి ఖాతాలో ₹17.46L జమయ్యాయి. దీంతో ఈనెల 6న పోలీసులు భవీశ్‌పై కేసు నమోదు చేశారు.

News October 20, 2025

బాణసంచా పేలి గాయమైతే..

image

బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలిన భాగాన్ని 15 నిమిషాల పాటు కుళాయి నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల పటాకుల వేడి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని అంటున్నారు. అలాగే కాలిన భాగంలో పసుపు పొడి, పేస్ట్ వంటివి పూయకూడదని, దీనివల్ల గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ఉన్న చోట టపాకాయలు పేల్చవద్దని సూచిస్తున్నారు.