News November 6, 2024
భారత్‌లో రూ.2.7 లక్షల కోట్లు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ ఎవరంటే?
భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద FPIగా సింగపూర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సావరిన్ ఫండ్స్ ద్వారా ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల విలువైన షేర్లను హోల్డ్ చేసింది. 2, 3 ప్లేసుల్లోని నార్జెస్ బ్యాంక్ రూ.1.42 లక్షల కోట్లు, US క్యాపిటల్ గ్రూప్ రూ.1.33 లక్షల కోట్ల కన్నా ఇదెంతో ఎక్కువ. HDFC బ్యాంకు, RIL, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఇన్ఫీ, LT, NTPC, M&Mలో ఎక్కువ పెట్టుబడి పెట్టింది.
Similar News
News November 6, 2024
పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
News November 6, 2024
అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి
AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
News November 6, 2024
నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యం: మంత్రి రవీంద్ర
AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరీక్షలు చేస్తామని తెలిపారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు 13 ప్రామాణిక పరీక్షలు ఉంటాయన్నారు.