News October 30, 2024
రచ్చకెక్కింది ఎవరు?: విజయమ్మ లేఖపై వైసీపీ స్పందన

AP: జగన్-షర్మిల వివాదంపై విజయమ్మ రాసిన <<14483905>>లేఖపై<<>> YCP స్పందించింది. ఆమెను అమితంగా గౌరవిస్తామని చెబుతూ కొన్ని అంశాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది. ‘జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదోవపట్టించడమే. షర్మిల ఒత్తిళ్లకు లొంగి ఆమె ఇలా వ్యవహరించారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఓపికతో భరించారు. రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు?’ అని ప్రశ్నించింది.
Similar News
News November 27, 2025
మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్లో FIR నమోదైంది.
News November 27, 2025
డబ్బులిస్తే జాబ్ వస్తుందా?.. ఇకనైనా మారండి!

HYDలో ఓ నకిలీ IT కంపెనీ ఉద్యోగాల పేరిట 400 మంది నిరుద్యోగులను మోసగించింది. జాబ్ గ్యారెంటీ పేరుతో రూ.3లక్షల చొప్పున వసూలు చేసింది. ఇలా మోసపోవద్దంటే.. తప్పుదోవలో ఉద్యోగం కోసం వెతక్కుండా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఏ కంపెనీ కూడా డబ్బు తీసుకొని జాబ్ ఇవ్వదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు నేర్చుకుంటే, మీ అర్హత, స్కిల్స్ ఆధారంగా ఉద్యోగం సాధించవచ్చు. నైపుణ్యం ఉంటే ఉద్యోగం మీదే.
News November 27, 2025
Viral: చిరంజీవితో కొండా సురేఖ సెల్ఫీ

TG: మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సురేఖ.. బుధవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో చూసిన మెగాస్టార్ అభిమానులు.. ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు.


