News April 3, 2024

రాజానగరం రాజు ఎవరో?

image

AP: పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గం తూ.గో(D) రాజానగరం. 2009,14లో ఇక్కడ TDP గెలువగా 2019లో YCP అభ్యర్థి జక్కంపూడి రాజా నెగ్గారు. మరోసారి రాజా YCP నుంచి బరిలో నిలువగా.. జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. పథకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కలిసొస్తుందని MLA రాజా భావిస్తున్నారు. TDP క్యాడర్ సపోర్ట్‌, పవన్ ఇమేజ్‌తో గెలుపు ఖాయమని బలరామకృష్ణ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 11, 2026

మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తాం: ఇరాన్

image

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పదేపదే <<18824047>>బెదిరిస్తుండటంపై<<>> ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘అమెరికా మాపై అటాక్స్ చేస్తే ఈ రీజియన్‌లో ప్రతి US బేస్‌ను, ఇజ్రాయెల్‌ను లక్ష్యాలుగా చేసుకుంటాం’ అని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ బాకెర్ కాలిబాఫ్ హెచ్చరించారు. తాము నలువైపుల నుంచి శత్రువులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ‘అమెరికా నాశనమవ్వాలి’ అంటూ పార్లమెంటులో సభ్యులు నినాదాలు చేశారు.

News January 11, 2026

సంక్రాంతికి స్టాలిన్ కానుక.. రూ.3వేలు, చీర, ధోతి, బియ్యం, చక్కెర

image

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.

News January 11, 2026

న్యూజిలాండ్ జట్టులో భారతీయుడు.. ఎవరీ ఆదిత్య?

image

INDతో జరుగుతున్న తొలివన్డేలో న్యూజిలాండ్ జట్టులో మరో భారతీయుడు చోటుదక్కించుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ 2002 సెప్టెంబర్ 5న వేలూరు(TN)లో పుట్టారు. అతడికి 4 ఏళ్ల వయసప్పుడే ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 2023 ఆగస్టులో NZ తరఫున టీ20ల్లో, డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అప్పుడప్పుడూ భారత్‌కు వస్తుంటారు. CSK అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. రజినీకాంత్‌కు ఆదిత్య పెద్ద ఫ్యాన్.