News August 13, 2024
అత్యంత విధ్వంసకర బ్యాటర్ ఎవరు?

క్రికెట్ ప్రేమికుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న. పైన కనిపిస్తున్న బ్యాటర్లందరూ విధ్వంసానికి మారుపేరు. రోహిత్, మ్యాక్స్వెల్, క్లాసెన్, నికోలస్ పూరన్, సూర్యకుమార్, బట్లర్, సికందర్ రజా, సాల్ట్, హెడ్.. వీళ్లు సెట్ అయ్యారంటే ప్రత్యర్థులు ఆశలు వదులుకోవాల్సిందే. మరి పై ప్లేయర్లలో అత్యంత విధ్వంసకర బ్యాటర్ ఎవరో కామెంట్ చేయండి.
Similar News
News September 15, 2025
ఆసిఫాబాద్: వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం, బనార్వాడకు చెందిన చిచోల్కార్ సుధాకర్ (66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 2న తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన సుధాకర్, సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.