News November 21, 2024
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?
దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(అక్టోబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. అక్టోబర్‌లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న పలు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత దళపతి విజయ్, షారుఖ్, జూ.ఎన్టీఆర్, అజిత్ కుమార్, అల్లుఅర్జున్, మహేశ్‌బాబు ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.
Similar News
News November 21, 2024
‘నో లీవ్స్.. జ్వరమొచ్చినా రావాల్సిందే’.. ఆఫీస్ నోటీస్ వైరల్
డిసెంబర్‌ను విదేశాల్లో వెకేషన్ మంత్‌గా పరిగణిస్తుంటారు. అక్కడివారందరూ సుదీర్ఘ సెలవులో టూర్లకు వెళ్తుంటారు. దీంతో ఇండియా నుంచి వారికి పనిచేసే కంపెనీలు బిజీ అయిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన నోటీస్ వైరలవుతోంది. ‘అత్యంత బిజీగా ఉండే రోజులు కాబట్టి ఈనెల 25 నుంచి డిసెంబర్ 31వరకు సెలవులుండవు. లీవ్స్ బ్లాక్ చేశాం. అనారోగ్యంగా ఉన్నా మినహాయింపులు ఉండవు’ అని సదరు కంపెనీలో నోటీసు అంటించారు.
News November 21, 2024
సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ
IND మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అద్భుతమైన డబుల్ సెంచరీ చేశారు. 229 బంతుల్లోనే అజేయ ద్విశతకం బాదేశారు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 260 పరుగులకు ఆలౌటైంది. ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 468/2 స్కోర్ చేసింది.
News November 21, 2024
ఏంటీ.. అరటిపండు ఆర్ట్‌కు రూ.52 కోట్లా?
ఇది కూడా ఓ ఆర్టేనా? అనుకున్నవి కూడా రూ.కోట్ల ధరలు పలుకుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన వేలంలో గోడకు టేపుతో అంటించిన ఓ కళాఖండాన్ని క్రిప్టోకరెన్సీ ఎంట్రపెన్యూర్ జస్టిన్ సన్ ఏకంగా $6.2 మిలియన్లకు(రూ.52కోట్లు) కొనుగోలు చేశారు. దీంతో అత్యంత ఖరీదైన అరటిపండుగా ఇది రికార్డులకెక్కింది. హాస్యనటుడు మౌరిజియో కాటెలాన్ దీనిని రూపొందించారు. అరటిపండు కుళ్లిపోతే ఎలా మార్చాలో కూడా ఆయన చెప్పారు.