News June 3, 2024

అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ ఎవరంటే?

image

దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు BJP MP ప్రీతమ్ ముండే పేరిట ఉంది. తండ్రి గోపినాథ్ మరణంతో 2014లో జరిగిన ఉపఎన్నికలో మహారాష్ట్ర బీడ్ నియోజకవర్గం నుంచి ప్రీతమ్ బరిలోకి దిగారు. ఈ స్థానంలో 6.96 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో CR పాటిల్(నవసరి) 6.89 లక్షలు, సంజయ్ భాటియా(కర్నాల్) 6.56 లక్షల మెజారిటీతో ఉన్నారు.

Similar News

News November 21, 2025

HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

News November 21, 2025

వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

image

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News November 21, 2025

పరమ పావన మాసం ‘మార్గశిరం’

image

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.