News October 24, 2024

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి?

image

BJP జాతీయ అధ్య‌క్ష ఎన్నిక‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ సారి ద‌క్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గ‌న‌క జ‌రిగితే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రేసులో ముందున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క‌, తెలంగాణ, AP, కేర‌ళలో పార్టీ బలోపేతానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు! ఉత్త‌రాది విష‌యానికొస్తే రాజ్‌నాథ్ సింగ్, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.

Similar News

News January 3, 2025

వైజాగ్‌లో రేపు నేవీ డే విన్యాసాలు

image

AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించగా ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో జరగనున్నాయి.

News January 3, 2025

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా.. అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.115 కోట్లు కేటాయించింది.

News January 3, 2025

సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల దోపిడీ

image

సంక్రాంతికి ఊళ్లు వెళ్లేవారిని ట్రావెల్స్ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రైలు టికెట్లు నెలల ముందే నిండిపోవడం, ఆర్టీసీలోనూ ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులకు వేరే దారి లేని సందర్భాన్ని వాడుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.6వేలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.