News September 17, 2024
ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ

రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ అందజేస్తానని వెల్లడించారు.
Similar News
News November 22, 2025
రాష్ట్రంలో 78 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS,MD,MS,DNB,PG డిగ్రీ, పీజీ డిప్లొమా, DM,M.CH,MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rajannasircilla.telangana.gov.in./
News November 22, 2025
నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

TG: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మ.3 గంటలకు డీజీపీ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు.
News November 22, 2025
బ్లడ్ గ్రూప్ డైట్ గురించి తెలుసా?

కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్‌లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్‌ను బట్టి రక్తంలో చేరి అనారోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. A: పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా, టమాట, వంకాయ, గోధుమలు, జొన్న, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి.


