News January 30, 2025
కొత్త సీఎస్ ఎవరో?

తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ(సీఎస్) శాంతి కుమారి పదవీకాలం ఏప్రిల్ 7న ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్లు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది చూడాలి.
Similar News
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


