News March 8, 2025

ICC ఫైనల్స్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత ప్లేయర్ ఎవరంటే?

image

ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే. 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో దాదా 117పరుగులు చేయగా, భారత్ 264 పరుగులు చేసింది. అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా CT ఫైనల్‌లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకుంటుందా? కామెంట్.

Similar News

News March 27, 2026

మార్కాపురం ప్రమాదం.. వారి సేవలు భేష్

image

రాయవరం బస్ ప్రమాదంలో పోలీస్, అగ్నిమాపక, 108, వైద్య ఆరోగ్య, వాలంటీర్ల సేవలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా సీఐ సుబ్బారావు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ అగ్ని కీలలు ఎగిసిపడుతున్నా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్లారు. బస్సులో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాల శరీర భాగాలను ఎక్కడా మిస్ కాకుండా కిందకు దించేందుకు తీవ్రంగా శ్రమించారు.

News March 27, 2026

వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

image

మేకప్‌ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్‌ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్‌ వాషర్‌ సోప్‌, యాంటి బ్యాక్టీరియల్‌ సోప్‌, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.

News March 27, 2026

జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

image

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.