News October 13, 2024

వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?

image

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.

Similar News

News October 13, 2024

ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు.. విశేషాలు

image

తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.

News October 13, 2024

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్‌లు ఆడి 10 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.

News October 13, 2024

WC.. ఇవాళ భారత్ VS ఆసీస్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ALL THE BEST INDIA