News December 30, 2024
దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?
భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.
Similar News
News January 2, 2025
ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ
AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News January 2, 2025
బుక్ చేసిన 10 నిమిషాల్లో అంబులెన్స్
క్విక్ కామర్స్ సంస్థ ‘బ్లింకిట్’ అంబులెన్స్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బుక్ చేసిన 10 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని ఆ సంస్థ సీఈవో అల్బిందర్ ప్రకటించారు. తొలుత గురుగ్రామ్ నగరంలో ఐదు అంబులెన్సులతో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్, పారామెడిక్, సహాయకుడు, లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటాయి.
News January 2, 2025
అందరూ సిగ్గుపడాలి.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
లింగం, కులాల ఆధారంగా వివక్ష కొనసాగుతున్న సమాజంలో జీవిస్తున్నందుకు అందరం సిగ్గుపడాలని మద్రాస్ HC జడ్జి జస్టిస్ వెల్మురుగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలోని అన్నా వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై నిరసనకు అనుమతివ్వాలని PMK పార్టీ కోర్టుకెక్కింది. రాజకీయ పార్టీల నిరసనలు మీడియా దృష్టిని ఆకర్షించడానికే తప్పా సదుద్దేశాలతో కాదని ఘాటుగా స్పందిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.