News September 21, 2024
లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక

ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.
Similar News
News November 27, 2025
జమ్మికుంట: నిలకడగా పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. గురువారం యార్డుకు 462 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,250, కనిష్ఠంగా రూ.6,250, అలాగే గోనెసంచుల్లో వచ్చిన 11 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ. 6,300 ధర లభించిందని మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


