News June 7, 2024
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?

AP అసెంబ్లీ స్పీకర్గా ఎవరు నియమితులవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణ రాజు తనకు ఈ పదవి కావాలని TDP అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు నెల్లూరు(D) ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. CMగా CBN ప్రమాణ స్వీకారం అనంతరం దీనిపై స్పష్టత రానుంది.
Similar News
News November 27, 2025
HYD: సమయానికి MMTS రైల్వే సర్వీసులు

HYDలోని లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న MMTS రైల్వే సర్వీసులు సమయానికి అందుబాటులో ఉంటున్నాయని SCR రైల్వే అధికారులు తెలిపారు. 9 6% సమయపాలన పాటిస్తున్నట్లుగా రికార్డులో తెలిసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తూనే, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.
News November 27, 2025
BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.


