News April 12, 2025
ఈ నెలలో భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ తన భార్యతో కలిసి జైపూర్, ఆగ్రా పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య ఉష భారత సంతతి మహిళ కావడం విశేషం.
Similar News
News November 8, 2025
ఒలింపిక్స్కు క్రికెట్ జట్ల ఎంపిక ఇలా..

LA-2028 ఒలింపిక్స్లో ఆడే క్రికెట్ జట్ల ఎంపికను ICC పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఖండాలవారీగా ర్యాంకింగ్లోని టాప్ జట్లు ఆడనున్నాయి. IND(ఆసియా), SA(ఆఫ్రికా), ENG(యూరప్), AUS(ఓషియానియా), ఆతిథ్య జట్టుగా USA/WI ఎంపికవుతాయి. ఆరవ జట్టుగా గ్లోబల్ క్వాలిఫయర్ ఎంపిక బాధ్యత అమెరికాపై ఉండనుంది. ఈ విధానం వల్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న జట్టుకూ అవకాశం దక్కకపోవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News November 8, 2025
ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెడుతున్నారా?

ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ వీటిలో వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గల ఆహారాలను పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్లెస్ స్టీల్, సిలికాన్, బీస్వాక్స్, వెదురుతో చేసినవి వాడొచ్చు. అవన్నీ విషరహిత పదార్థాలతో తయారు చేయడం వల్ల.. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 8, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.


