News March 16, 2024
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు?

AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.
Similar News
News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News April 5, 2025
బతికుండగానే మరణాన్ని ప్రకటించుకున్న యువకుడు!

ఉద్యోగ వేటలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ మూడేళ్లుగా ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చనిపోయినట్లు సంస్మరణ ఫొటోను లింక్డిన్లో పోస్ట్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను వివరించగా.. చాలా మంది ఉద్యోగ అవకాశాల గురించి కామెంట్స్ చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు.
News April 5, 2025
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం సమీక్ష

TG: కంచ గచ్చిబౌలి భూముల కోర్టు కేసులు, ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆ భూముల్లో గత 25ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వణ్యప్రాణులు, పర్యావరణం వంటి వివాదాలు రాలేదని వారు CMకు వివరించారు. AI ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని తెలిపారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, వీడియోలపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు CM సూచించారు.