News May 24, 2024
బంగ్లాను చావు దెబ్బ కొట్టిన ఈ పేసర్ ఎవరు?

IPL2020 వేలంలో KKR ఓ అమెరికా పేసర్‌ను కొనడం సంచలనంగా మారిన విషయం గుర్తుందా? అతడే ఈ US బౌలర్ అలీఖాన్. బంగ్లాదేశ్‌పై అమెరికా 2-0తో T20 సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించడంలో కీలకపాత్ర పోషించారు. 2వ T20లో 3 వికెట్లు తీసి బంగ్లా టైగర్లను చావుదెబ్బ కొట్టారు. పాక్‌లో పుట్టి USకి వలస వెళ్లారు. IPLలో గాయంతో KKRకు ఆడకపోయినా.. ఆ ఫ్రాంచైజీ జట్లలోనే మిగతా లీగ్స్‌లో డెత్ ఓవర్ స్పెషలిస్టుగా అదరగొట్టారు.
Similar News
News December 6, 2025
తూ.గో.: 76 శాతం ‘ఖరీఫ్’ కోతలు పూర్తి

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 76.42 శాతం కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎస్. మాధవరావు తెలిపారు. మొత్తం 81,406 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 62,217 హెక్టార్లలో పంట కోతలు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


