News March 16, 2024

చరిత్ర సృష్టించేదెవరో?

image

మహిళల ప్రీమియర్ లీగ్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం ఢిల్లీ వేదికగా ఫైనల్ పోరులో DC, RCB తలపడనున్నాయి. ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరగా.. ఆర్సీబీ తొలిసారి అడుగుపెట్టింది. బలాబలాల విషయంలో రెండు జట్లు సమతూకంతో ఉండటంతో తుది పోరు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. అటు పురుష, మహిళల లీగ్‌ల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవని DC, RCBకి తొలిసారి టైటిల్‌ను ముద్దాడే అవకాశం వచ్చింది.

Similar News

News November 15, 2025

శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏదంటే..?

image

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ||
ఆరంభం, అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి, ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడిని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 15, 2025

కంపెనీ ఒకటే.. కానీ మార్కెట్‌లో మాత్రం పోటీ!

image

మాతృ సంస్థలు ఒకటైనా అందులోని ప్రొడక్ట్స్ మార్కెట్‌లో పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చైనాకు చెందిన BBK ఎలక్ట్రానిక్స్ Oppo, Vivo, OnePlus, Realme బ్రాండ్స్‌ను కలిగి ఉండగా.. ఇవి వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. Lifebuoy, Lux, Liril, Dove వంటి సోప్ బ్రాండ్స్‌తో పాటు హార్లిక్స్ & బూస్ట్ ప్రొడక్ట్స్‌ను Hindustan Unilever ఉత్పత్తి చేస్తుంది.

News November 15, 2025

8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

image

మహిళల క్రికెట్‌కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.