News December 5, 2024
పుష్పలో శ్రీవల్లి, షెకావత్ పాత్రల్ని ఎవరు చేయాలంటే..

పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక, షెకావత్ రోల్లో ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. అయితే, తొలుత ఆ పాత్రల్ని పోషించేందుకు మొదట వేరే నటీనటుల్ని సుకుమార్ సంప్రదించారట. టాలీవుడ్ టాక్ ప్రకారం.. శ్రీవల్లిగా సమంతను తీసుకోవాలనుకోగా ఆమె బిజీగా ఉండటంతో రష్మికను ఎంపిక చేశారు. ఇక షెకావత్ పాత్రకు విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్మెంట్ కుదరక మలయాళ నటుడు ఫాజిల్‌ను సుకుమార్ తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News February 22, 2026
పాకిస్థాన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

T20WC సూపర్-8లో భాగంగా నిన్న న్యూజిలాండ్vsపాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక T20I మ్యాచ్‌లు(7) రద్దయిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్(6), న్యూజిలాండ్(6), ఇండియా(4), నెదర్లాండ్స్(4) ఉన్నాయి. నిన్న మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
News February 22, 2026
కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt
News February 22, 2026
భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.


