News July 22, 2024
అధ్యక్ష ఎన్నికల రేసుకి ఫైనల్ అయ్యేది ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు. అయితే గావిన్ న్యూసమ్, జేబీ ప్రిట్జ్కేర్, గ్రెచెన్ విట్మర్, జాష్ షాపిరో, పీటె బుటిగీగ్ అనే మరో ఐదుగురు డెమోక్రాట్లు రేసులో నిలిచే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేతలకు మంచి ఆదరణ ఉందని స్థానిక మీడియా చెబుతోంది.
Similar News
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<