News March 7, 2025
CT ఫైనల్ రద్దయితే విజేత ఎవరు..?

ఆదివారం IND-NZ మధ్య జరిగే CT ఫైనల్‌కు వర్షం ముప్పులేదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఇరు జట్లు కనీసం 25 ఓవర్లపాటు ఆడితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం ప్రకటిస్తారు. మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే రిజర్వుడేకు వాయిదా వేస్తారు. అప్పుడూ వరుణుడు కరుణించకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతగా ప్రకటిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.
Similar News
News December 9, 2025
ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: రామ్మోహన్ నాయుడు

ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ‘ఇండిగో సంక్షోభంపై విచారణకు ఆదేశించాం. ప్రయాణికుల ఇబ్బందికి యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ఇప్పటికే DGCA నోటీసులు జారీ చేసింది. జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇండిగోపై ఉంది. DGCA రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయి. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చింది.’ అని తెలిపారు.
News December 9, 2025
రిజర్వేషన్ లేకుండా AC కోచ్‌లో ప్రయాణించవచ్చా?

జనరల్, స్లీపర్ క్లాస్ టికెట్‌తో కూడా AC కోచ్‌లలో ప్రయాణించవచ్చని కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారతీయ రైల్వే మండిపడింది. ఇలాంటివి నమ్మొద్దని స్పష్టం చేసింది. ‘రిజర్వేషన్ లేకపోయినా రూ.250 ఫైన్ చెల్లించి ACలో వెళ్లొచ్చనేది తప్పు. దీనివల్ల రైల్వేకు నష్టం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. సరైన టికెట్‌తోనే ప్రయాణించాలి’ అని సూచించింది.
News December 9, 2025
వైరస్ తెగుళ్లు- నారు నాటేటప్పుడు జాగ్రత్తలు

నారు మొక్కలను పొలంలో నాటే 2-3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.4 మి.లీ.) లేదా అసిటామిప్రిడ్ (లీటరు నీటికి 0.3 గ్రా.) మందు ద్రావణం నారు మొక్కలపై పిచికారీ చేయాలి. దీని వల్ల వైరస్‌ను వ్యాప్తిచేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. అలాగే పొలంలో కూడా వైరస్‌ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం, పసుపురంగు అట్టలను ఎకరాకు 25 ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి.


