News March 17, 2024
అవనిగడ్డ కూటమి టికెట్ ఎవరికి దక్కునో?

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఎవరికి దక్కుతుందనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ తరఫున ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి,మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరఫున మత్తి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
News April 3, 2025
విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.