News February 8, 2025

మేజిక్ ఫిగర్ దక్కేదెవరికో?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత తేలిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.

Similar News

News February 8, 2025

ఆప్‌కు బిగ్ షాక్

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్‌, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.

News February 8, 2025

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ

image

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీడింగ్‌లో ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.

error: Content is protected !!